స్త్రీల మైత్రిలో చేర రారమ్మా-శ్రీ యేసుప్రభుని శ్రేయ మొప్పుగ కొలువ రారమ్మ స్త్రీల సేవను ప్రేమతో గౌని చాలా దయతో చేర దీసి మేలు చేసి యాదరించిన యేసు పేరట సేవచేయును
||స్త్రీల మైత్రితో॥
1. భక్తురాండ్రగు స్త్రీల పరిచర్యన్ ప్రభు యేసు ధరలో మక్కువ తో యంగీకరించెనుగా శక్తి గల యా రక్షకుండు యెక్కువగు యాదరణ జూపి తక్కువగు మన స్త్రీల స్థితినిల యుక్తముగ బహు యుద్ధరించెను॥స్త్రీల మైత్రితో॥
2. స్త్రీలు అందరు సేనగా చేరి – స్థిరమైన మైత్రిలో – మేలుగా రక్షకుని గొనియాడె – వీలుగా మన దేశమునకు పాలు మాలక సేవ చేసి చాలగా మన యేసు ప్రేమను చక్కగా ప్రత్యక్షపర్చును ||స్త్రీల మైత్రిలో॥
3. దక్షిణిండియా సభలో నున్నట్టి – స్త్రీలంత గూడి- ఏకమగు సహవాసమందుండి దీక్షతో ప్రార్థనల యందు – సేవ యందు సాక్ష్యమందు – రక్షకుండగు యేసు శక్తిని స్పష్టముగ నిలచాటి చూపకు ||స్త్రీల మైత్రిలో॥