శ్రీ యేసుని స్తోత్ర గీతం కలసి పాడుదమా సంపూర్ణ జీవితమునకు సాగిపోవుదమా సంఘమా ముందుకు సాగుమా జీవిత యాత్రలో దేవుని సేవలో
1. అపోస్తలుల జీవితం హతసాక్షుల అనుభవం కావాలి జీవిత ఆదర్శము కలిగి యుండాలి స్థిర విశ్వాసము యేసు వైపు చూచుచు సిలువ భారం మోయుచు సాగించు నీ యాత్రిక పయనము॥సంఘమా॥
2. ఇంటింట ప్రార్థన – ప్రతి సంఘారాదన మరచిపోవచ్చు ప్రభు సంస్కారము కలసి ధ్యానించు దేవుని వాక్యము అవయవాలు ఎన్నున్నా ఒక్కటే శరీరం సాగించు సమసమాజ జీవనం ॥సంఘమా॥
3. కపట సాక్షులు ఎందరో క్రీస్తు దేవుడు కాడని పలుకు తియ్యని తేనె బోధలు నమ్మకు పూర్వనమ్మిక నుండి ఎన్నడు తొలగకు ప్రాథమిక పాఠాలతోనే కాలమంత గడపకు సాగించు ప్రగతి పధమున జీవితం॥సంఘమా॥
4. క్రియలు లేని నమ్మిక సాగించకు నీవిక పొరుగు వాని ప్రేమించు నీవలె శ్రతువులను మన్నించు ప్రభువలె అవసరములో ఉన్నవాని ఆదుకొనేటే న్యాయము సాగించు ఈ ధర్మ కార్యము ॥సంఘమా॥
5. ప్రభుని వార్త ప్రకటన ప్రజల కొరకై నివేదన నీ ధ్యేయం కావాలి సంఘమా ఈ భారం నీదే గమనించుమా త్రియేక దైవం అందించు సాయం సాగించే ప్రభుని వార్త మహోద్యమం ||సంఘమా॥