విజయంబు విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువు గెల్చి నేఁడు వేంచేసె || Vijayambu vijayambu vijayambu maa yesu nijame mrutyuvu gelchi nendu venchese || Telugu Christian Songs Lyrics

విజయంబు విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువు
గెల్చి నేఁడు వేంచేసె యజమానుఁ డెల్ల ప్ర యాసము లెడఁబాప
స్వజనుల రక్షింప సమసె సిలువమీఁద ||విజయంబు||

1. విజయంబు విజయంబు విజయంబు మానవుల వృజిన నివృత్తిని
విభుఁ డొనరింపన్ గుజనులచే నతఁడు క్రూర మరణము నొంది విజిత
మృత్యువు నుండి విజయుండై వేంచేసె ||విజయంబు||

2. విజయంబు విజయంబు విజయంబు మా యేసు భుజము మీఁదను
మోయుఁ బరిపాలనంబు కుజము మీఁదను బ్రాణ త్యజనము జేసెను
ధ్వజము మోయుచు సిల్వ పాప మోడింతము ||విజయంబు||

3. విజయంబు విజయంబు విజయం బిఁకను మా క పజయము కాకుండఁ
బ్రభు యేసు క్రీస్తు సుజనత్వమున వైరి వ్రజము గెల్వఁగఁజేసి
నిజముగఁ బరలోక నిలయంబులో నిల్పు ||విజయంబు||

4. విజయంబు విజయంబు విజయం బనెడి పాట నిజభక్తితో మనము
నేర్చిన వాని భజియించుదము భూన భములు తాఁ బాలించు అజిత
జీవ ప్రదుఁ డమరత్వ మిడు మనకు ||విజయంబు||