ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర || Aananda yaatra idi aatmiya yaatra || Telugu Christian Songs Lyrics

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన యెరుశాలేము యాత్ర

1. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను
ఎయి నోళ్ళతో స్తుతియించినను
తీర్చలేము ఆ ఋణమును

2. రాత్రియు పగలుయు పాదములకు రాయి తగులకుండా
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవ దూతలు మనకుండగా

3. కృతజ్ఞతా లేనివారు వేల కొలదిగా కూలినను
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృపను పొందెదము

4. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణం ఆసన్నం
ఆత్మానంద భారితులమై – ఆగమన కాంక్షతో సాగేదం